జీవో 29 రద్దు చేయాలి : కెేవీపీఎస్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన జీవో 29ను రద్దు చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) డిమాండ్‌ చేసింది. రిజర్వేషన్‌పరంగా దళిత, గిరిజన బలహీనవర్గాలు పొందాల్సిన ఉద్యోగాలను అగ్రకులాలకు అప్పజేప్పడమే ఈ జీవో లక్ష్యమని పేర్కొంది. ఈ మేరకు సోమవారం కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు జాన్‌వెస్లీ టి. స్కైలాబ్‌ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను జీవో 55 జీవో ప్రకారం నిర్వహించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఖండించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29 ప్రకారం రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థి జనరల్‌ కోటాలో ఎంపికైనా రిజర్వు కోటాగానే పరిగణిస్తారని తెలిపారు. దీంతో ఇతర రిజర్వుడ్‌ అభ్యర్థులు తీవ్రంగా నష్ట్టపోయే ప్రమాదముందని గుర్తు చేశారు. జీవో 29ను రద్దు చేసి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.