జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చేయూత 

– ఎన్ఐటి సూరత్కల్ కర్ణాటకలో సీటు సాధించిన నిరుపేద విద్యార్థికి ఆర్థిక సహాయం 
10వేల రూపాయలు ఆర్థిక సాయం
నవతెలంగాణ -తాడ్వాయి 
ఎన్ఐటి సూరత్కల్ కర్ణాటకలో సీటు సాధించిన ఉరటం గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరు (జంపంగవాయి) గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి అనుముల శ్రీకాంత్ కు సరిహద్దు మండలం అయినా మంగపేట మండలానికి చెందిన జ్వాల చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కోడెల నరేష్ ఆధ్వర్యంలో జ్వాలా ట్రస్ట్ దాతల సహకారంతో రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం నుండి కానీ, దాతలు ఎవరైనా కానీ సహాయం చేయాలని కోరారు. వారు 9490521999 నెంబర్ కు ఫోన్పే గాని గూగుల్ పే గాని చేయాలని కోరారు. ఈ సందర్భంగా జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో ఉండి కష్టపడి చదివి ఎన్ఐటి ఎంటెక్ కర్ణాటకలో సీట్ సాధించినందుకు అభినందించారు. ప్రతి విద్యార్థి శ్రీకాంత్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కోడెల నరేష్, కార్యదర్శి మునిగల రాకేష్, ట్రస్ట్ సభ్యులు ఎండి ఇంతియాజ్, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.