– సారలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
– బీఆర్ఎస్ లో చేరికలు
నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య అన్నారు. సోమవారం మండలంలోని ఊరటం సర్పంచ్ గొంది శ్రీధర్ తో కలిసి కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో బడే నాగజ్యోతి అత్యధిక మెజారిటీతో గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుండి గజ్జల పవన్ బీఆర్ఎస్ లోకి రాగా, కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఊరట్టం, కొత్తూరు, కన్నెపల్లి గ్రామాలలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తాడిత, పీడిత ప్రజల కోసం ప్రాణాలర్పించిన యోధుడు బడే ప్రభాకర్ అన్న దంపతుల కూతురు బడే నాగజ్యోతిని ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. ప్రజలు, ప్రతిపక్షాలు చెప్పే మాయమాటలకు ఆగం కావద్దని, అభివృద్ధిలో భాగం కావాలని సూచించారు. ఓవైపు కాంగ్రెస్, బిజెపి తీరును ఎండగడుతూనే.. మరోవైపు స్వరాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. కాగా మండల వ్యాప్తంగా, కాటాపూర్, వెంగలాపూర్, గోనెపల్లి, తాడ్వాయి మండల కేంద్రం, గంగారం వివిధ గ్రామాల్లో మండల వ్యాప్తంగా విస్తృతంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు గడప గడప తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. మండలంలోని ప్రజలు సానుకూలంగా బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో ఊరటం గ్రామ కమిటీ అధ్యక్షుడు గజ్జల మహేష్ ఉపసర్పంచ్ కోరం సమ్మక్క, వార్డు మెంబర్లు నీలం విజయ్, గజ్జల రాంబాబు, ముండ్రాతి రాజు రాజమౌళి, బండారు చంద్రయ్య, దిండి మోహన్ రావు, నువ్వుశెట్టి రమేష్, పుల్లూరు గౌరమ్మ, ఆలేటి ఇంద్రారెడ్డి, గడ్డం అరుణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.