నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండలంలోని కంజర్ గ్రామ శివారులో గల జ్యోతి పూలే బీసీ గురుకుల పాఠశాలను శుక్రవారం రోజున సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గాను ఇక్కడ పాఠశాలలో భూపతిరెడ్డి ప్రారంభించడం జరిగింది. 24 కోట్ల వ్యయంతో ఇక్కడ విద్యార్థుల కొరకు నూతన భవనాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ. అన్నిటికంటే గొప్పదైన ఆస్తి విద్య అని ఇది తరిగిపోయే వనరు కాదని విద్య వల్ల గొప్పవాడు అయితే మనతో పాటు మన కుటుంబానికి మన దేశానికి గర్వకారణం ఉంటుందని ఆయన తెలిపారు. నేను కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాడినని మేము చదువుకున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలను అంత గుర్తింపు ఇచ్చే వారు కాదని నేటి సమాజంలో ప్రభుత్వాలు ఎంతో వ్యయంతో సకల సౌకర్యాలతో ప్రభుత్వ భవనాలు యూనిఫార్మ్స్ అలాగే మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తుందని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి ప్రాధాన్యత విద్యారంగానికి ఇస్తున్నాడని ఆయన తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు ఒక గోల్ ఎంచుకొని దానికి తగ్గట్టు శ్రమ పడాలని, సమాజంలో విద్య ఉన్నవారికి గుర్తింపు ఉంటుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా నేటి సమాజంలో పోటీ పడాలంటే స్కిల్స్ చాలా ముఖ్యమని స్కిల్స్ పెంపొందించుకోవడం వల్ల ఈ ప్రపంచ గ్లోబలైజేషన్లో పోటీ తత్వాన్ని తట్టుకోవడం జరుగుతుందని, ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే విద్యార్థులకు చాలా తెలివి ఉంటుందని వారు ఈ రంగంలోనైనా రాణిస్తారని ఆయన తెలిపారు అలాగే అక్కడున్న టీచర్లకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్ ఆర్ సి ఓ సత్యనాథ్ రెడ్డి, ముప్పా గంగారెడ్డి, మోపాల్ మండల అధ్యక్షుడు సాయి రెడ్డి, శేఖర్ గౌడ్, సూర్య రెడ్డి, బాడ్చి సొసైటీ చైర్మన్ నిమ్మల మోహన్ రెడ్డి, పాఠశాల సిబ్బంది మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు