K-12 పుస్తకాలు కో ఎన్సిఇఆర్టితో Amazon.in భాగస్వామ్యం

Amazon.inపై NCERT బుక్ స్టోర్ విస్తృత శ్రేణి పాఠ్య పుస్తకాలను అందిస్తుంది, నాణ్యతతో కూడిన చదువు సులభంగా మరియు తక్కువ వ్యయానికి లభ్యమవడాన్ని నిర్థారిస్తుంది

నవతెలంగాణ బెంగళూరు: కిండర్ గార్టెన్ నుండి 12వ తరగతి వరకు, యుపిఎస్ సి ఆశావహులకు పాఠ్య పుస్తకాలను Amazon.in ద్వారా లభింపచేయడాన్ని విస్తరించడానికి అమేజాన్ ఇండియా ఈరోజు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ మరియు ట్రైనింగ్ (NCERT)తో భాగస్వామం గురించి ఈ రోజు ప్రకటించింది. లెటర్ ఆఫ్ ఎంగేజ్ మెంట్ (LoE) ద్వారా ధృవీకరించబడిన ఈ భాగస్వామ్యం, భారతదేశంలో సేవలు అందించబడే అన్ని పిన్ కోడ్స్ లో NCERT పుస్తకాలు మాగ్జిమమ్ రిటైల్ ప్రైస్ (ఎంఆర్ పి)కి లభింపచేయడానికి హామీ ఇస్తుంది, విద్యార్థులకు అసలైన లెర్నింగ్ మెటీరియల్, వనరులు అందుబాటులో ఉండేలా నిర్థారిస్తుంది.
ఈ సహకారం ద్వారా, అమేజాన్, NCERTలు భారతదేశంలోని సేవలు అందించబడే అన్ని పిన్ కోడ్స్ లో ప్రస్తుత మరియు ఖచ్చితమైన పాఠ్య పుస్తకాల లభ్యత మరియు ఇంటి వద్ద డెలివరీని నిర్థారించడం ద్వారా విద్యార్థుల చదువు అవసరాలను మద్దతు చేయడంపై దృష్టి కేంద్రీకరించాయి.
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  మాట్లాడుతూ..“శక్తివంతమైన, అభివృద్ధి చెందిన జాతిని నిర్మించడానికి  నాణ్యతా విద్య మరియు జీవన సౌలభ్యాలు ప్రధానం. ఎన్ సిఇఆర్ టి మరియు అమేజాన్ ఇండియాల మధ్య సహకారం అనేది విద్యార్థులు, విద్యావేత్తలకు అసలైన, వ్యయభరితం కాని వనరులు అందుబాటులో ఉంచడాన్ని నిర్థారించే దిశగా తీసుకోబడిన చర్య ఇది. ఇది వారి విద్యా ప్రయాణంలో వారికి సహాయపడటమే కాకుండా వారి పూర్తి జీవన సౌలభ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందిAmazon.in ద్వారా ఎన్ సిఇఆర్ టి  పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉంచడం ద్వారా, ఎలాంటి అడ్డంకులు లేకుండా తమ విద్యను గొప్ప సౌకర్యంతో  కొనసాగించడానికి భారతదేశంవ్యాప్తంగా లక్షలాది విద్యార్థులకు మేము వీలు కల్పిస్తున్నాంఅని అన్నారు.

అవసరమైన ఉత్పత్తులు ప్రతి రోజూ  సులభంగా అందుబాటులో  ఉంచినందుకు దేశంలోని లక్షలాది భారతీయులు అమేజాన్ ను విశ్వసించారు, మరియు నాణ్యతతో కూడిన చదువు ఇందుకు మినహాయింపు కాదని మేము విశ్వసిస్తాం. సరసమైన ధరలకు అసలైన ఎన్ సిఇఆర్ టి పుస్తకాలు లభించేలా నిర్థారించడానికి, అమేజాన్ మరింత నిజాయితీతో కూడిన మరియు నమ్మకమైన విద్యా వ్యవస్థను రూపొందించడంలో అమేజాన్ తన వంతు బాధ్యత పోషిస్తోంది. తమకు కావలసిన వనరులను పొందడానికి, ఎలాంటి రాజీ లేకుండా తమ లెర్నింగ్ ప్రయాణాన్ని మద్దతు చేయడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు విద్యావేత్తలకు ప్రయత్నం సులభం చేస్తుంది.” అని సౌరభ్ శ్రీవాత్సవ-వైస్ ప్రెసిడెంట్, కాటగిరీస్, అమేజాన్ ఇండియా అన్నారు.
వ్యక్తిగత కస్టమర్లకు సేవలు అందించడానికి అదనంగా, Amazon.in ప్రభుత్వ ఏజెన్సీలు, పాఠశాలల కోసం భారీ ఆర్డరింగ్ ను సరళతరం చేయడానికి ఎన్ సిఇఆర్ టితో కలిసి పని చేస్తుంది. పెద్ద పరిమాణంలోని పాఠ్య పుస్తకాలను సేకరించడానికి సంస్థలకు సులభతరం చేసింది. దీనిని మద్దతు చేయడానికి, సకాలంలో, సమర్థవంతమైన డెలివరీస్ ను నిర్థారించడానికి Amazon.in పై విక్రేతలతో కలిసి పని చేసే నిర్దిష్టమైన డిస్ట్రిబ్యూషన్ వెండర్స్ ను ఎన్ సిఇఆర్ టి నియామకం చేసింది.

ఈ చొరవను మరింత మద్దతు చేయడానికి, ప్రత్యేకమైన ఎన్ సిఇఆర్ టి బుక్ స్టోర్ Amazon.inపై ఏర్పాటు చేయబడింది, వినియోగదారులకు అదనపు ఖర్చు లేకుండా సులభంగా అందుబాటులో ఉండే ప్రదేశంలో పూర్తి శ్రేణి పాఠ్యపుస్తకాలను ఇది అందిస్తోంది. అమేజాన్ ఇండియా మరియు NCERTల మధ్య ఈ భాగస్వామం మరింత నిజాయితీతో కూడిన మరియు నమ్మకమైన విద్యా వ్యవస్థను రూపొందించే లక్ష్యాన్ని కలిగి ఉంది. మొత్తంగా, దేశవ్యాప్తంగా

లక్షలాది లెర్నర్స్ కోసం నాణ్యతతో కూడిన చదువు యొక్క వ్యవస్థలు  అందుబాటులో ఉండటాన్ని నిర్థారించడానికి  అమేజాన్ మరియు NCERTలు కలిసి పని చేస్తున్నాయి.

నిరాకరణ: Amazon.inపై ప్రదర్శించబడిన డీల్స్, ఆఫర్లు మరియు డిస్కౌంట్లను సంబంధిత విక్రేతలు లేదా బ్రాండ్స్ కేటాయించాయి. Amazon.in అనేది ఒక ఆన్ లైన్ మార్కెట్ ప్రదేశం మరియు స్టోర్ పదం అనేది విక్రేత అందించే ఎంపికతో స్టోర్ ఫ్రంట్ ను సూచిస్తుంది.