
డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్గా కే.మల్లేష్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఐగా పని చేసిన కృష్ణ ఐజీ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో నిర్మల్ సీసీఎస్ సీఐగా పని చేస్తున్న మల్లేష్ డిచ్పల్లికి బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు ఏదైనా సమస్య ఉంటే నేరుగా వచ్చి పోలీసులను సంప్రదించాలని సూచించారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. యువత చెడు వ్యసనాలను దూరంగా ఉండాలని సూచించారు. నూతన సీఐ కి డిచ్ పల్లి, జక్రాన్ పల్లి,ఇందల్ వాయి
ఎస్సై లు యు మహేష్, తిరుపతి, ఎస్ మహేష్, పోలీస్ స్టేషన్ సిబ్బంది శూభాకాంక్షలు తెలిపారు.