కిరణ్ అబ్బవరం హీరోగా హాస్య మూవీస్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 7గా రాజేష్ దండ నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్ట్‌కి ‘కె -ర్యాంప్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కొత్త డైరెక్టర్ జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం జరిగిన ఈ చిత్ర పూజా కార్యక్రమానికి దిల్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టారు. నిర్మాత అనిల్ సుంకర కెమెరా స్విచ్ఛాన్ చేశారు. డైరెక్టర్స్ విజరు కనకమేడల, రామ్ అబ్బరాజు, యదు వంశీ, రైటర్ ప్రసన్న స్క్రిప్ట్ అందజేశారు. యోగి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటి, సీనియర్ నరేష్ పాల్గొన్నారు. తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ చూస్తుంటే నిజంగానే ర్యాంప్ ఆడించేలా ఉన్నారు. ఇదేదో యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన స్టిల్‌లా కనిపిస్తోంది. కిరణ్ అబ్బవరంను పూర్తిగా చూపించలేదు గానీ.. చుట్టూ ఆ మందిని చూస్తుంటే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేసినట్టుగానే ఉన్నారు. ఈ చిత్రం కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి నిర్మాత : రాజేష్ దండ, సహ నిర్మాత : బాలాజి గుట్ట, ప్రభాకర్ బురుగు, రచన, దర్శకత్వం : జైన్స్ నాని, సంగీతం : చేతన్ భరద్వాజ్, కెమెరామెన్ : సతీష్ రెడ్డి మాసం, ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి, ఆర్ట్ డైరెక్టర్: సుధీర్ మాచర్ల, ఎడిటర్ : చోటా కె. ప్రసాద్, యాక్షన్: పథ్వీ.