‘క’.. ఆ నమ్మకాన్ని, ధైర్యానిచ్చింది

'Ka'.. gave that belief and courageథ్రిల్లర్‌ జోనర్‌లో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చి ఘన విజయాన్ని అందుకున్న చిత్రం ‘క’. కిరణ్‌ అబ్బవరం, నయన్‌ సారిక, తన్వీ రామ్‌ నాయకానాయికలుగా నటించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై చింతా గోపాలకష్ణ రెడ్డి నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్‌, సందీప్‌ ఈ సినిమాతో తమ ప్రతిభ నిరూపించుకున్నారు. దీపావళి బాక్సాఫీస్‌ రేసులో విన్నర్‌గా నిలిచిన ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా 50 కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించింది. ఈ మూవీ ఈటీవీ విన్‌లో డాల్బీ విజన్‌ 4కే, అట్మాస్‌ టెక్నాలజీతో స్ట్రీమింగ్‌కు వచ్చి, అక్కడ కూడా గ్రాండ్‌ సక్సెస్‌ అందుకుంది. అతి తక్కువ టైమ్‌లో 100 మిలియన్‌ మినిట్స్‌ వ్యూయర్‌ షిప్‌ దక్కించుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘క’ బ్లాక్‌ బస్టర్‌ ధమాకా ఈవెంట్‌లో హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ, ‘ఈ సినిమాకు మేం ఎంతగా ప్రమోషన్‌ చేశామో, ఈటీవీ విన్‌ టీమ్‌ కూడా అంతే ప్రమోషన్‌ చేసి, ఆడియెన్స్‌కు సినిమా బాగా రీచ్‌ అయ్యేలా చేస్తున్నారు. పైరసీ అనేది జరగకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రతి ఒక్కరి ఇంటికి ఈ సినిమాను చేర్చారు. మంచి సినిమా చేస్తే ప్రేక్షకుల ప్రేమను గెల్చుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని ఈ సినిమా ఇచ్చింది’ అని తెలిపారు. దర్శక ద్వయం సుజీత్‌, సందీప్‌, ఈటీవీ విన్‌ బిజినెస్‌ హెడ్‌ సాయి కష్ణ ఈ సినిమా ఘనవిజయం సాధించడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.