నవతెలంగాణ – వేములవాడ రూరల్
నేటి నుండి నుండి 18వరకు సూర్యాపేటలో జరగనున్న 33వ సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులకు వేములవాడ రూరల్ మండలంలోని చెక్కపల్లి గ్రామంలో లయ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్ గురువారంతో ముగిసింది. క్యాంప్ లో పాల్గొన్న క్రీడాకారులకు వేములవాడ పట్టణంలోని శ్రీ ఆంజనేయ ఆటో మొబైల్స్ యాజమాని ముస్కు తిరుపతి రెడ్డి క్రీడా దుస్తులను అందించాడు. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అతిథులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా కబడ్డీ అసోషియేషన్ ఉపాధ్యక్షులు చొప్పరి మల్లేశం, బొడ్డు రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి సింగారపు తిరుపతి, లయ యూత్ క్లబ్ అధ్యక్షుడు నల్ల శ్రీనివాసరెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోస్కుల రవి, చెక్కపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కబడ్డీ క్రీడాకారులు గీస శ్రీనివాస్, అడ్డిగ శ్రీనివాస్ రెడ్డి, తుపాకుల వెంకటేష్ ,నేరెళ్ల శ్రావణ్ మెతుకు సంపత్ రెడ్డిలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.