సంక్రాంతి సంబరాలలో కబడ్డీ పోటీలు..

నవతెలంగాణ-భిక్కనూర్ : సంక్రాంతి సందర్భంగా భిక్కనూరు పట్టణంతో పాటు జంగంపల్లి ఆయా గ్రామాలలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలో రైజింగ్ స్టార్ ఆర్గనైజేషన్, జంగంపల్లి గ్రామంలో స్వర్గీయ అత్తెల్లి కిష్టయ్య జ్ఞాపకార్థం నిర్వహించిన కబడ్డీ పోటీలలో గెలిచిన వారికి బహుమతులు అందజేసి యువకులు చదువుతోపాటు కలిసిమెలిసి గ్రామ అభివృద్ధికి, క్రీడా రంగాలలో రాణించాలని ప్రజాప్రతినిధులు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు శ్రీనివాస్, మోహన్ రెడ్డి, వేణు, రమేష్, రవీందర్, పోటీలో గెలుపొందిన యువకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.