అట్టహాసంగా ప్రారంభమైన కబడ్డీ పోటీలు

నవతెలంగాణ -పెద్దవూర : జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల ప్రకారం మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో పోలీస్ వారి తరుపున సాగర్ సీఐ బీసన్న పెద్దవూర మండల కేంద్రం లోని జెడ్పిహెచ్ ఉన్నత పాఠశాల లో కబడ్డీపోటీలు గురువారం అట్ట హాసంగా ప్రారంభి క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడారు. ఈ పోటీలు పోలీస్ వారి ఆధ్వర్యంలో క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది కలుగ కుండా నిర్వహింస్తున్నామన్నారు.మండలం లో మొత్తం 14 టీములు పోటీలు పాల్గొంటున్నాయని అన్నారు.పోటీలలో గెలువు ఓటములు సహజమని క్రీడాల్లో స్ఫూర్తిని చాటాలని అన్నారు. న్యాయ నిర్నెతలుగా ప్రభుత్వ పాఠశాల లో పనిచేస్తున్న వ్యాయమ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పోటీలు జరుగుతున్నాయని తెలిపారు.మండల స్తాయిలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన రెండు టీములను డివిజన్ స్తాయికి ఎంపిక జరుగుతుందని అన్నారు.డివిజన్ స్తాయిలో ప్రతిభ చాటిన టీములు జిల్లా స్తాయిలో పాల్గొంటాయని అన్నారు.మండలస్థాయి పోటీలలో గెలుపొందిన జట్లు కు ప్రధమ బహుమతి 2500, ద్వితీయ బహుమతి 1500, తృతీయ బహుమతి 1000లుగా నిర్ణయం చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్దవూర ఎస్ఐ వీరబాబు, పోలిస్ సిబ్బంది, తోడిమ సుధాకర్ రెడ్డి,తదితరులు