– 26 నుంచి ప్రొ కబడ్డీ ప్లే ఆఫ్స్
హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ ఫైనల్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. తెలుగు రాష్ట్రాల జట్టు తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశమే లేకపోయినా ప్రొ కబడ్డీ లీగ్ నిర్వాహకులు గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియాన్ని కీలక మ్యాచులకు వేదికగా ఎంచుకున్నారు. లీగ్ దశలో టాప్-2లో నిలిచిన రెండు జట్లు నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించనున్నాయి. టాప్-6లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటాయి. ఎలిమినేటర్ 1లో నం.3, నం.6 జట్లు పోటీపడనుండగా, ఎలిమినేటర్2లో నం.4, నం.5 జట్లు తలపడతాయి. తొలి సెమీస్‌లో టేబుల్ టాపర్‌తో ఎలిమినేటర్ 1 విజేత ఢకొీట్టనుంది. ఎలిమినేటర్ 2 విజేతతో నం.2 జట్టు సమరానికి సై అననుంది. మార్చి 26న ఎలిమినేటర్ 1తో ప్లే ఆఫ్స్ ఆరంభం కానుండగా.. మార్చి 1న టైటిల్ పోరు జరుగనుంది.