నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : రోడ్డు ప్రమాదంలో కబడ్డీ క్రీడాకారుడు మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి హుస్నాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అక్కన్నపేట మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన పులికాశి సంపత్ 47 మృతి చెందాడు. హుస్నాబాద్ కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో హుస్నాబాద్ ఏనేవద్ద గుర్తుతెలియని వ్యక్తి లిఫ్టు కోసం రోడ్డుపై నిలుచుని అకస్మాత్తుగా బైకు ఎదురుగా వచ్చాడు. దీంతో అదుపుతప్పి రోడ్డుపై పడ్డాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సంపత్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య నిర్మల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించారు. మృతునికి కుమారుడు సాయి ఉన్నారు.