ఫిబ్రవరి 02 వరకు కబడ్డీ టీములు నమోదు చేసుకోగలరు

నవతెలంగాణ -పెద్దవూర
ఫిబ్రవరి 02 వతేది వరకు మండలం లో కబడ్డీ టీముల వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో నమోదు చేసుకోగలరని పెద్దవూర ఎస్ ఐ వీరబాబు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయన విలేకరుల సమావేషం లో మాట్లాడారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల ప్రకారం మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు,నాగార్జున సాగర్ సీఐ బీసన్న పర్యవేక్షణలో పెద్దవూర మండలంలో పోలీస్ వారి తరఫున కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి రెండో తారీఖు వరకు పెద్దవూర మండలంలోని కబడ్డీ ఫొటోలలో పాల్గొనేవారు వారి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో కబడ్డీ టీములను నమోదు చేసుకోగలరని కోరారు. గ్రామముల వారీగా లేదా ఇంకా ఎక్కువ  టీంలు అయినా  కూడా పోలీస్ స్టేషన్లో మీ యొక్క టీం మెంబర్ల పేర్లు, టీముల వివరాలు నమోదు చేయించుకోగలరని అన్నారు.
నమోదు చేయించుకున్న తర్వాత  మండలంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో లేదా,బీసీ హాస్టల్ నాగార్జునసాగర్ లో కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుందని వీటికి గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న పిఈటీల ఆధ్వర్యంలో న్యాయ నిర్నెతలుగా  ఉంటారని తెలిపారు. కావున మండలంలోని కబడ్డీ ఆడే వారు పోలీస్ స్టేషన్లో మీ యొక్క కబడ్డీ టీం వివరాలు నమోదు చేయించుకోగలరని కోరారు. మండలస్థాయి పోటీలలో ప్రధమ బహుమతి 2500, ద్వితీయ బహుమతి 1500, తృతీయ బహుమతి 1000లుగా నిర్ణయం చేశారని తెలిపారు.