జల నిర్బంధంలో కాచాపూర్ గ్రామం

– గత 50 సంవత్సరాల కాలంలో ఇలాంటి సంఘటన లేదు
న‌వ‌తెలంగాణ‌ – హుస్నాబాద్/ కోహెడ:

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాచాపూర్ గ్రామం జల నిర్బంధంలో ఉందని ట్విన్ విలేజెస్ డెవలప్ మెంట్ ఫోరం కన్వీనర్ లింగంపల్లి అమర్ నాథ్ తెలిపారు.
గత 50 సంవత్సరాల కాలంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదన్నారు. గ్రామం చుట్టూ మూడు వైపులా వరద ఉధృతి ఎక్కువ అవ్వడంతో రాకపోకలు నిలిచిపోయాయన్నారు. గతంలో ఎన్ని సార్లు ఊరికి బ్రిడ్జి కమ్ రోడ్ సంక్షన్ అయినా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం పనులు చేపట్టిన దాఖలా లేదు. 2023 లో మా నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత మంత్రి పొన్నం. ప్రభాకర్ ఎన్నికల హామీలో భాగంగా “ఏ అవసరం వచ్చినా అందుబాటులో వుంటానని” తెలిపారు. ఇప్పుడు ఆ హామీ నెరవేర్చే సమయం ఆసన్నమైందని గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన మోక్షం కలగలేదు. ఇప్పటికైనా రోడ్డు కమ్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు
Amarnath