– రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులునందిని సిద్ధారెడ్డి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
పోరాటాల పురిటి గడ్డ భువనగిరి ప్రాంతంలో ఎన్నో సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించిన కాచరాజు జయప్రకాశ్‌ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని , తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు, రచయిత నందిని సిధ్ధారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం భువనగిరిలోని ఎంఎన్‌ఆర్ గార్డెన్ లో జరిగిన కాచరాజు జయప్రకాశ్ సంతాప సభలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో, తెలుగు భాషా రక్షణ ఉద్యమం లో కాచరాజు జయప్రకాశ్‌చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. కవి పాత్ర సమాజంలో చాలా విలువైనదని,తన కలం ద్వారా ఒక ఊరును, ఒక పట్టణాన్ని, చివరకు సమాజాన్నే మార్చగలడని అన్నారు. సాహితీ ప్రియునిగా కాచరాజు జయప్రకాష్ సమాజం లో సామాజిక రుగ్మతలను, రూపుమాపుటలో క్రియాశీలకంగా పనిచేసాడని తెలిపారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాచరాజు జయప్రకాష్ అందరివాడని, తలలో నాలుకలా కలిసి మెలిసి ఉండేవాడని తెలిపారు. రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు కొలుపుల అమరేందర్ మాట్లాడుతూ కాచరాజు జయప్రకాష్ నిరంతరం సామాజిక సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేవారన్నారు. సమున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ సామాజిక ఉద్యమ నాయకులు కాచరాజు జయప్రకాష్ మరణం తీరని లోటన్నారు. లోక్ సత్తా ఉభయ తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త బండారు రామ్మోహనరావు అధ్యక్షతన జరిగిన ఈ సంతాప సమావేశంలో దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, టాప్రా రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగా అరుణ, సింగరాజు పల్లి ప్రధానోపాధ్యాయులు కళావతి, రిటైర్డ్ ఎం ఈ ఓ కంఠం చంద్రమోహన్, బండారు రవివర్ధన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్, వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎండి.అతహర్, సీపీఐ జిల్లా అధ్యక్షులు గోద శ్రీరాములు, బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమణారావు, సామాజిక ఉద్యమ నాయకులు కొడారి వెంకటేష్, ఎస్ మల్లారెడ్డి, ఎస్ కే హమీద్ పాషా, శ్రీనివాసాచార్యులు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ అక్షింతల కష్ణమూర్తి, పోలి శంకర్ రెడ్డి, జిట్టా భాస్కర్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షులు ఉమామహేశ్వర్,బీీఆర్‌ఎస్ నాయకులు చందుపట్ల వెంకటేశ్వరరావు, విశ్వేశ్వర్ రావు, వైజయంతి, రమేష్, ఇటికాల లావణ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ, నాయకులు కోట స్వామి, పాశం శివానంద్, బండారు జయశ్రీ, ఎర్ర శివరాజ్, కే మల్లేశం,ఆవుల వినోద్, వడపర్తి సర్పంచ్ ఎలిమినేటి కష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.