
సత్య సాయి కన్వెన్షన్ హల్ మడికొండ బుధవారం రోజున ఉదయం 10:00గం. లకు మడికొండలోని సత్య సాయి కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంగళవారం ఒక ప్రకటనలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు,ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, పాలకమండలి సభ్యులు, ముఖ్య నాయకులు లోక్ సభ ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయం సాధించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య హాజరు కానున్నారు.ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికకు కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు నూతనంగా ఎన్నికైన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారిని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకు పరిచయం చేయడం జరుగుతుందన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు,యువకులు, మహిళలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ తప్పక హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఆయన ఈ సందర్భంగా కోరారు.