
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఈసారి అవకాశాన్ని ఇచ్చి ఆశీర్వదించండి అని టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం మండలంలోని మలక్ పల్లి, ధర్మాపురం పెద్ద పెండ్యాల, నారాయణగిరి, ముప్పారం, ధర్మసాగర్ గ్రామాలలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, వారి ఆశయ సాధనలో రైతు సంక్షేమమే ధ్యేయంగా పల్లెలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయని ఉద్దేశంతో అపార భగీరథుడిగా అనేక సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ప్రవేశపెట్టారని గుర్తు బంగారు తెలంగాణ దిశగా తీర్చిదిద్దేందుకు మరొక అవకాశాన్ని అందివ్వాలని కోరారు. చాలా సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్టేషన్ ఘన్పూర్ ప్రజలకు సుస్థిర పాలన అందించేందుకు నాకు అవకాశం ఇచ్చారని అందుకు దాదాపు 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో స్టేషన్ ఘన్పూర్ ప్రజలకు నేను నా జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ఈ ఒక్కసారి మీ ఆధార్ అభిమానాలు నా పైన ఉంచి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. మాట తప్పని మనిషిగా నియోజకవర్గ ప్రజలకు నా శాయశక్తుల నీతి నిజాయితీలతో పని చేస్తానని, ఎవరికి ఎలాంటి తల వంపులు లేకుండా తల ఎత్తుకునే విధంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నానని అన్నారు.ఈ ఒకసారి అవకాశాన్ని ఇస్తే ఐదు సంవత్సరాలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. అలాగే గెలిచిన సంవత్సరంలోపు కరుణాపురం ఫ్లైఓవర్ వంతెన నిర్మిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పిటిసి పిట్టల శ్రీలత సత్యనారాయణ, వైస్ ఎంపీపీ బండారు రవీందర్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సర్పంచ్ మునిగేల రాజు,సర్పంచులు ఎర్రబెల్లి శరత్, గోనెల సమ్మక్క రాజయ్య, మునిగాల యాకోబు, ఆకారపు అన్నమ్మ, పెసరు రమేష్, నాయకులు బేర మధుకర్, సోంపల్లి కరుణాకర్, చాడ కుమార్, బోడ్డు ప్రభుదాస్,రాజ్ కుమార్, విన్ను, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.