అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు: కడియం శ్రీహరి

Welfare Schemes for All Deserving: Kadiam Srihariనవతెలంగాణ-ధర్మసాగర్
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ద్యేయంమని స్థానిక ఎమ్మెల్యే  కడియం శ్రీహరి అన్నారు. గురువారం మండలంలోని క్యాతంపల్లి గ్రామంలో ప్రజా పాలనలో ఆయన ముఖ్య పాల్గొని మాట్లాడారు.లిస్టులో పేర్లు రాలేదని ఆందోళన చెందవద్దని,దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు.అర్హులైన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే వారి పేర్లను నమోదు చేసుకోవచ్చని చెప్పారు.గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల జనవరి 26 నుండి రాష్ట్రంలో పేద ప్రజల కొరకు నాలుగు సంక్షేమ పథకాలు అమలు చేయాలనే ఉద్దేశంతో గ్రామసభలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రేషన్ కార్డు లేనివారికి కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా కింద రైతుకు పెట్టుబడి సాయం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి 12వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడంతో పాటు నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు.ఈ నాలుగు సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనంతరం మండలంలోని నారాయణగిరి గ్రామస్తుల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ముందుగా గ్రామంలో ప్రధాన సమస్యగా ఉన్న ఫీడర్ ఛానల్ కాలువ ను స్వయంగా నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు. వెంటనే ఇరిగేష్ అధికారులతో మాట్లాడి కాలువ పనులకు ఎస్టిమేషన్ వేసి పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలో పర్యటించి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.ముప్పారం నెలకు ఎస్ఎంఎస్లకు త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. అనవసరమైన రాజకీయాలను పక్కనపెట్టి అందరం కలిసికట్టుగా గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి అన్నారు. కార్యక్రమంలో హనంకొండ డిఆర్డిఏ స్థానిక తహసిల్దార్ సదానందం ఎంపీడీవో అనిల్ కుమార్ ప్రజా ప్రతినిధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.