– తేలని ఖమ్మం సీటు
– మరో మూడు స్థానాలు పెండింగ్‌లోనే
న్యూఢిల్లీ: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో 12 నుంచి 15 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న కాంగ్రెస్.. తాజాగా మరో అభ్యర్థిని ప్రకటించింది. ఎవరూ ఊహించని రీతిలో ఈ అభ్యర్థి ప్రకటన ఉండటం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది… వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరు ఖరారు చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. మరో మూడు స్థానాలైన ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను పెండింగ్‌లోనే పెట్టింది. పోటీ ఎక్కువగా ఉండటంతో ఈ మూడు స్థానాలపై చర్చోపచర్చలు జరిపినా..ఇంకా తేలకపోవటంతో పక్కన బెట్టింది.