మంత్రి, ఎంపీ కి వినతి పత్రాన్ని అందజేసిన కాయితి లంబడ నాయకులు

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలో తరగతి గదుల ప్రారంభోత్సవనికి సోమవారం నాడు విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ బీబీ పాటిల్ వచ్చిన సందర్భంగా  పెద్ద కొడపగల్ కాయితి లంబడ నాయకులు వినతిపత్రం అందజేశారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాయితి లంబడలను ఎస్టీ రిజర్వేషన్ కల్పిస్తానని హామీ ఇవ్వడం జరగిందని అది ఇప్పటి వరకు అమలు చేయలేదని దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్  దృష్టి కి తీసుకెళ్లి అమలు చేసే విదంగా కృషి చేయాలని కోరారు. దింతో మంత్రి,ఎంపీ సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాతాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసీ చంద్ర బాగా,మండల యూత్ అధ్యక్షుడు రాజేందర్, ఉప అధ్యక్షులు నరేష్,తదితరులు పాల్గొన్నారు.