– పోస్టర్ ఆవిష్కరించిన సీపీఎస్ యూనియన్ : రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు స్థితప్రజ్ఞ, కల్వల్ శ్రీకాంత్
నవతెలంగాణ-వరంగల్
తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 22న వరంగల్‌లో జరగనున్న ‘కాకతీ కదన భేరి’ కార్యక్రమం పోస్టర్‌ను యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు స్థితప్రజ్ఞ, కల్వల్ శ్రీకాంత్.. రంగంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం ఆవిష్కరించారు. అనంతరం సంఘం సభ్యత్వ నమోదు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ.. 1 ఏప్రిల్ 2025 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేయనున్న ఏకీకృత పెన్షన్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ డిసెంబర్ 22న ఉద్యోగ, ఉపాధ్యాయులతో వరంగల్ జిల్లా కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఈ ఏకీకృత పెన్షన్ విధానం.. కార్పొరేట్ల కడుపు నింపడానికి వచ్చిందే తప్ప, ఉద్యోగి కుటుంబానికి సామాజిక భద్రత చేకూర్చే పథకం కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జీవన్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగమూర్తి, బుచ్చన్న, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మల్లికార్జున్, ఆఫ్జల్, కొండ శ్రీనివాస్, లక్ష్మమ్మూర్తి, రవీందర్ రెడ్డి, దిల్షాన్, శివ కోటి, రాజేందర్, నర్సమ్మ, సరళ రాణి, అశ్విని, రాజు తదితరులు పాల్గొన్నారు.