– నియోజకవర్గంలో సంబరాలు
నవతెలంగాణ -తొర్రూర్ రూరల్:
పాలకుర్తి నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీకి భారీ దెబ్బ పడింది నియోజకవర్గంలోని ఎర్రబెల్లి ముఖ్య అనుచరుడు వరంగల్ డిసిసి బ్యాంక్ డైరెక్టర్ తొర్రూర్ పిఎసిఎస్ చైర్మన్ సోమరం గ్రామానికి చెందిన కాకిరాల హరి ప్రసాదరావు శనివారం రాత్రి పీసీసీ అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో చేరడంతో పాలకుర్తి నియోజకవర్గం లో కార్యకర్తలు ఆనందోత్సవాలు జరుపుకున్నారు. అతనితోపాటు మరికొంతమంది ప్రజా ప్రతినిధులను నాయకులను తీసుకువెళ్లడంతో బీఆర్ఎస్ పార్టీకి భారీ గండి పడింది కాంగ్రెస్ పార్టీలో వాగ్దాటి నైపుణ్యం ఎవరికి లేకపోవడంతో కాకిరాల రావడంతో కొంత ఉపశమనం లభించిందని నాయకులు అనుకుంటున్నారు, గతంలో కాకిరాల హరి ప్రసాదరావు నాయకత్వంలో దుగ్యాల శ్రీనివాసరావు మరియు ఎర్రబెల్లి దయాకర్ రావు లను ఎమ్మెల్యేలుగా గెలవడంలో కీలక పాత్ర పోషించాడని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మామిడాల యశస్విని ఝాన్సీ రెడ్డి గెలవడంలో కీలక పాత్ర పోషించనున్నాడని నాయకులు చర్చించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ముఖ్య పాత్ర పోషిస్తాడని ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని చర్చ జోరుగా సాగుతుంది. కాకిరాల హరి ప్రసాదరావు బాటలో మరికొంతమంది జాతీయ పార్టీ నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనేందుకు మరి కొంతమంది కీలక నాయకులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.