నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని చేపూరు క్షత్రియ పాఠశాల నందు వార్షికోత్సవ వేడుకలు కళా మహోత్సవ్ వార్షికోత్సవ సంబరాలు శనివారం రాత్రి ఘనంగా జరిగినాయి. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర బౌద్దిక్ సహా ప్రముఖ్, శివ కుమార్ క్షత్రియ విద్యాసంస్థల ఛైర్మన్ శ్రీ అల్జాపూర్ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించినారు. ఇట్టి వార్షికోత్సవ వేడుకలని ఉద్దేశించి క్షత్రియ విద్యాసంస్థల ఛైర్మన్ శ్రీ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రెవిన్యూ డివిజన్లోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య మరియు సంస్కారమైన చదువును అందించాలనే లక్ష్యంతో ఆర్మూర్ లో మొట్ట మొదటి సీబీఎస్సీ పాఠశాలను ప్రారంభించామని, ప్రతి విద్యార్ధి ఉన్నత విద్య పరిపూర్ణ వ్యక్తిత్వము పోంది సమాజంలో భాద్యతయుతమైన పౌరులుగా ఎదగాలనే లక్ష్యంతో మా పాఠశాల పని చేస్తున్నాదని, గత విద్యా సంవత్సరంలో పదో తరగతి మొదటి బ్యాచ్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారని, సంస్కారం లేని చదువు నిరర్థకమని, అటువంటి విద్యార్థులు సమాజానికి భారమౌతారని, యావత్ ప్రపంచానికి మార్గదర్శనం చేసే శక్తి సామర్థ్యాలు భారత దేశానికి ఉన్నాయని, పండిత్ దీనదాయల్ ఉపాధ్యాయ గారి ఆలోచనలకు అనుగుణంగా తమ విద్యాసంస్థలు పని చేస్తున్నాయని అన్నారు.ఈ సందర్భంగా విద్యాసంస్థల సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. తల్లి-దండ్రులు తమ అమూల్యమైన సలహాలు, సూచనలను అందించాలని అన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మి నరసింహ స్వామి పాఠశాల వార్షిక నివేదికను సోదాహరణంగా చదివి వినిపించారు. ఈ సందర్బంగా ప్రస్తుత విద్య సంవత్సరంలో పాఠ్య మరియు సహా పాఠ్య కార్యక్రమలలో విజయం సాధించిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు, మెడల్స్ బహుకరించినారు. ఈ సందర్భంగా నర్సరీ నుండి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన దైవ, దేశ సైనికుల, రైతు గొప్పతనం, అమ్మ -నాన్న ప్రేమ, ఇతర రాష్ట్రాల సాంప్రదాయాలను ప్రతిబింబించే పలు నృత్య ప్రదర్శనలు కరాటే విన్యాసాలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి.ఇట్టి వేడుకలలో సెక్రటరీ మరియు కరెస్పాండంట్ అల్జాపూర్ దేవేందర్, వైస్ చైర్మన్ అల్జాపూర్ లక్ష్మీనారాయణ, కోశాధికారి అల్జాపూర్ గంగాధర్, డైరెక్టర్స్ అల్జాపూర్ వీరేంద్ర, అక్షయ్, పరీక్షిత్, బ్రాంచ్ ప్రిన్సిపాల్ అరుంధతి, ఇరు పాఠశాలల సిబ్బంది, తల్లితండ్రులు పాల్గొన్నారు.