మండలంలోని ఇసన్నపల్లి(రామారెడ్డి) లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు శనివారం కన్నుల విందుగా నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా నాలుగవ రోజు స్వామివారికి సంతత ధారాభిషేకం, ధ్వజారోహణము, మహా పూజ, సింధూర పూజ, డోలారోహణము (తొట్లే జన్మదినం) అన్నదానము, బండ్ల ఊరేగింపు, భద్రకాళి పూజ తదితర కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఒగ్గు కథ కళాకారులచే ఒగ్గు కథ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి ప్రభు, అర్చకులు శ్రీనివాస్ శర్మ, వంశీకృష్ణ శర్మ, సిబ్బంది సిహెచ్ లక్ష్మణ్, నాగరాజు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.