రూ.200 కోట్లతో ‘కాలభైరవ’

రూ.200 కోట్లతో 'కాలభైరవ'రాఘవ లారెన్స్‌ హీరోగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సూపర్‌ హీరో ఫిల్మ్‌ ‘కాల భైరవ’. ఏ స్టూడియోస్‌ ఎల్‌ఎల్‌పి, గోల్డ్‌ మైన్‌ టెలీ ఫిల్మ్స్‌, నీలాద్రి ప్రొడక్షన్స్‌, హవీష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘రాక్షసుడు, ఖిలాడ’ి వంటి చిత్రాలను రూపొందించిన నిర్మాత కోనేరు సత్యనారాయణ తాజాగా  ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిస్తున్నారు. లారెన్స్‌ కెరీర్‌లో హీరోగా ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ యాక్షన్‌ అడ్వెంచరస్‌ మూవీ ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేయగా, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి రాఘవ లారెన్స్‌ లుక్‌ అందరిలో ఆసక్తిని పెంచుతోంది. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ, మనీష్‌ షా అత్యంత భారీగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్‌ నుంచి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయబోతున్నారు.