టీఎస్‌ఎస్‌ ఓ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కలకొండ లక్ష్మణ్‌

నవతెలంగాణ-మాడ్గుల
తెలంగాణ సామాజిక స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మండలలోని ఇర్వీన్‌ గ్రామానికి చెందిన కలకొండ లక్ష్మణ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాదులోని సంస్థ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు మీసాల లక్ష్మి నివాస్‌ నియామక పత్రం అందజేసినట్టు లక్ష్మణ్‌ తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యత నియమించిన లక్ష్మీనివాసుకు ఆయన కతజ్ఞతలు తెలిపారు. విద్యా రంగ సమస్యలపై రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సుదర్శన్‌, శేఖర్‌, వంశీకష్ణ పాల్గొన్నారు.