– 60 మంది ఉపాధ్యాయులకు ఘన సన్మానం
నవతెలంగాణ-ములుగు
కలాం ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్లో వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి సర్వర్ అధ్యక్షతన బుదవారం జరిగిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ప్రధాన ఉత్సవానికి ఆయనతోపాటు జిల్లా విద్యాధికారి జి పాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొదట జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రాధాకష్ణ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువా పూలదండ మెమొంటోలతో వైభవోపేతంగా సన్మానించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ వెంకన్న మాట్లాడుతూ జిల్లాలో కలాం ఫౌండేషన్ పేరుతో ఒక సామాజిక స్వచ్ఛంద సంస్థ ఉండడం గర్వకారణం అని అన్నారు. ఈ సేవా సంస్థకు కషిచేసిన వ్యక్తులను ఈ సందర్భంగా అభినందిస్తున్నానని ఆయన తెలిపారు. నిరుపేదలకు ఉత్తములకు మారుమూల గ్రామాలలో వరద బాధితులకు కరోనా సమయంలో నిరుపేదలను ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదుకోవడం హర్షనియమన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి జి పాణి నీ మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుల సేవలను గుర్తించి వారే ఎంపిక చేసి సన్మానం చేయడము గర్వించదగ్గ విషయమని తెలిపారు. వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి సర్వర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పెండ్యాల సలేంద్రం ప్రధాన కార్యదర్శి కొండపర్తి సదయ్యలు నిస్వార్ధంగా చేస్తున్న ఈ ఫౌండేషన్ ముందు భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. విద్యాశాఖలో ములుగు జిల్లా చేస్తున్న కషిని రాష్ట్రస్థాయి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ఆయన అన్నారు. గతంలో 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలోనే ఐదవ స్థానంలో నిలవడం ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ లో రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించడం ఉపాధ్యాయుల కషికి నిదర్శనం అని ఆయన కొనియాడారు. ఉపాధ్యాయులు నవ సమాజ నిర్మాతలని వారి సేవలను గుర్తించి కలాం ఫౌండేషన్ సన్మానం చేయడము సంతోషకరమని ఈ సందర్భంగా డిఇఓ తెలిపారు. రానున్న రోజుల్లో కలాం ఫౌండేషన్కు తన వంతు సహకారం అందిస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఉత్తమ ఉపాధ్యాయ జిల్లా స్థాయి అవార్డులు తీసుకున్న ఉపాధ్యాయులను ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో కలం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి సర్వర్ ప్రధాన కార్యదర్శి కొండపర్తి సదయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ కోశాధికారి గడ్డం వెంకటేశ్వర్లు సభ్యులు మక్బూల్ పాషా ఎండి సోహెర్ బాబా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా అవార్డు గ్రహీత బాలాజీ రవి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా స్థాయిలోని తొమ్మిది మండలాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.