నవతెలంగాణ హైదరాబాద్: గాంధీ జ్ఞన్ ప్రతిష్టన్ యువజన విభాగం అధ్యక్షుడుగా కాలసాని సంజయ్ రెడ్డి నియామకం జరిగింది. బుధవారం ఉదయం గాంధీ భవన్ హైదరాబాదులో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ,గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్ రాష్ట్ర చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా కాలసాని సంజయ్ రెడ్డికి నియామక ఉత్తర్వులు అందజేశారు.
రాష్ట్రంలోని యువజన విభాగం పూర్తి కమిటీని, అన్ని జిల్లాలలో జిల్లా కమిటీలను త్వరలో ఏర్పాటు చేసి సంస్థ కార్యక్రమాలను మరింతగా విస్తృతపరచాలని, గాంధీ తత్వాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మెరుగు మధు, గాలి రాంబాబు, ఎడ్ల సురేందర్ యాదవ్, గూడూరు మదన్ మోహన్, సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన నియామక ఉత్తర్వులు అందజేసిన రాష్ట్ర కమిటీకి కాలసాని సంజయ్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలో రాష్ట్ర కమిటీ, 33 జిల్లాలకు జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తానని అన్నారు.