
మండల వ్యవసాయ అధికారి రాజు లింబుర్ గ్రామములో రైతు పురుషోత్తం పటేల్ సాగు చేస్తున్న యసంగి కంది పంటను పరిశీలించడం జరగింది. ముఖ్యంగా యాసంగిలో కంది వేయడం వల్ల రైతులు తక్కువ పెట్టుబడితో లాభం పొందవచ్చునని తెలిపారు. వానాకాలం కంటే యాసంగి లో కంది పంట కాలం తగ్గి త్వరగా కోతకి వస్తుంది. డిసెంబర్ నెలలో కంది వేయడం జరిగింది. ప్రస్తుతం పంట పుత , కాయ దశలో ఉన్నట్లు పరిశీలించడం జరిగిందని అన్నారు. మార్చ్ నెలలో పంట కోతకి వచ్చునని , ఎకరానికి 5 క్వింటాళ్ల నుంచి 7 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. పంట పరిశీలనలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఏవో రాజు రైతుకు వివరించారు. కార్యక్రమంలో ఏ ఈ ఓ నాందేవ్,రైతు పురుషోత్తం పటేల్ పాల్గొన్నారు.