
కాళేశ్వరం ప్రాజెక్టు నుండి వరద కాలువ ద్వారా చేరుకున్న గోదావరి జలాలను ముప్కాల్ పంప్ హౌజ్ ద్వారా ఎస్అర్ఎస్పి ప్రాజెక్ట్ లోకి కాళేశ్వరం నీళ్ళు విడుదల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, లతో కలిసి పాల్గొన్న రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ ఇతర నాయకులు.ఈసందర్బంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కాళేశ్వరం నుండి ఎస్అర్ఎస్పి ప్రాజెక్ట్ లోకి నీరు రావడం సంతోషదాయక మన్నారు.నిజామాబాద్ జిల్లా తోపాటు ఇతర జిల్లాల రైతులకు, ప్రజలకు కాళేశ్వరం జలలు చేరుకోవడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని బాజిరెడ్డి గోవర్ధన్ వివరించారు.