హైదరాబాద్‌కు కాళేశ్వరం జలాలు

హైదరాబాద్‌కు కాళేశ్వరం జలాలు– కాంగ్రెస్‌ అసత్య ప్రచారాలు చేసినా…
– కండ్ల ముందే ప్రయోజనాలు :కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరం ప్రాజెక్టుపైన ఎన్నో రకాల అసత్య ప్రచారాలు చేస్తున్నా ఆ ప్రాజెక్టు ప్రయోజనాలు కండ్ల ముందే కనిపిస్తున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్‌ చేశారు. కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్‌, హైదరాబాద్‌ నగరవాసులను ఆదుకోబోతున్నదని తెలిపారు. త్వరలో మల్లన్న సాగర్‌ 100 ఎంఎల్‌ డీల నీళ్లతో హైదరాబాద్‌ దాహాన్ని తీర్చనున్నాయంటూ ఒక వార్తా కథనాన్ని ఆయన ట్వీట్‌కు ట్యాగ్‌ చేశారు.