ఆత్మహత్యల నేపథ్యంలో కలి

Kali in the background of suicidesయువ హీరోలు ప్రిన్స్‌, నరేష్‌ అగస్త్య నటించిన సినిమా ‘కలి’. ఈ చిత్రాన్ని కథా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో రుద్ర క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. శివ శేషు దర్శకత్వం వహించారు. లీలా గౌతమ్‌ వర్మ నిర్మాత. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 4న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సమర్పకులు కె రాఘవేంద్ర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ‘ఆత్మహత్యల నేపథ్యంలో దర్శకుడు శివ శేషు రాసుకున్న కథ విన్నప్పుడు నాకు కొత్తగా అనిపించింది. శివరామ్‌ అనే గుడ్‌ పర్సన్‌ తన జీవితంలో ఎదురైన కొన్ని ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. ఆ టైమ్‌లో ఒక అపరిచిత వ్యక్తి వచ్చి అతని ఇంటి తలుపు తడతాడు. ఆ అపరిచిత వ్యక్తి ఇంట్లోకి వచ్చాక శివరామ్‌ జీవితం ఎలా మారింది అనేది ఈ సినిమా కథ. మా మూవీలో వీఎఫ్‌ఎక్స్‌ మంచి క్వాలిటీతో ఉంటాయి. ఇందులో బల్లి పాత్రకు ప్రియదర్శి, గోడ గడియారంకు అయ్యప్ప పి శర్మ డబ్బింగ్‌ చెప్పారు. మీరు సినిమా చూస్తున్నప్పుడు వాళ్లు నటించిన ఫీల్‌ కలుగుతుంది. ప్రొడ్యూసర్‌ లీలా గౌతమ్‌ వర్మ సినిమా మేకింగ్‌ మీద ప్యాషన్‌ ఉన్న యువకుడు. ప్రేమకథలు కాకుండా ఇలాంటి మెచ్యూర్డ్‌ సబ్జెక్ట్‌ ఎంచుకున్నాడు. దర్శకుడు శివ శేషుకి ఈ సినిమా పేరు తెస్తుంది’ అని తెలిపారు.