రొటీన్‌కి భిన్నంగా కళింగ

Unlike the routine Kalinga‘కిరోసిన్‌’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధవ వాయు ఇప్పుడు ‘కళింగ’ అంటూ కొత్త కాన్సెప్ట్‌తో హీరోగా, దర్శకుడిగా తన అదష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నారు. బిగ్‌ హిట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై దీప్తి కొండవీటి, పథ్వీ యాదవ్‌ నిర్మిసున్న ఈ సినిమాని సెప్టెంబర్‌ 13న విడుదల చేయబోతున్నారు. హీరో, దర్శకుడు ధవ వాయు మాట్లాడుతూ, ‘టీజర్‌, పోస్టర్‌ వీటితోనే సినిమా మీద హైప్‌ పెరిగింది. ఆల్రెడీ అన్ని చోట్లా బిజినెస్‌ అయింది. కంటెంట్‌ అందరికీ నచ్చడంతో అన్ని చోట్లా డీల్స్‌ అయిపోయాయి. ఇది కచ్చితంగా రెగ్యులర్‌ మూవీలా మాత్రం ఉండదు. అన్ని రకాల అంశాలు ఇందులో ఉంటాయి. ఇంత వరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో తెలుగులో రాలేదు’ అని తెలిపారు. ‘సినిమాను చూసిన తరువాత ఓ మంచి ఫీలింగ్‌తో ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటకు వస్తారు’ అని నిర్మాత దీప్తి కొండవీటి చెప్పారు. మరో నిర్మాత పథ్వీయాదవ్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. చాలా వరకు అవుట్‌ డోర్‌లో, ఫారెస్ట్‌లో తీశాం. ధవ వాయు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను తీశారు’ అని అన్నారు.