ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటానీ నటించిన సైన్స్ ఫిక్షన్ మాగమ్ ఓపస్ ‘కల్కి 2898 ఎడి’. ఈ చిత్ర ట్రైలర్ ఈనెల 10న రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్‌లో బుజ్జి అండ్ భైరవ ప్రిల్యూడ్ విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ చిత్ర ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుధవారం ఉదయం ట్రైలర్ లాంచ్‌ను అనౌన్స్ చేస్తూ, సినిమా అఫీషియల్ హ్యాండిల్ ఈ న్యూస్‌ని షేర్ చేసింది. ట్రైలర్ రిలీజ్ డేట్‌ని కొత్త పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. పోస్టర్‌లో మనం భైరవను చూడవచ్చు. ప్రభాస్ పర్వత శిఖరంపై నిలబడి ఆకాశం వైపు చూస్తూ కనిపించిన పోస్టర్ అదిరిపోయింది. పోస్టర్ పై రాసిన ఏ న్యూ వరల్డ్ ఎవైట్స్ అని రాసిన క్యాప్షన్ మరింత క్యురియాసిటీని పెంచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమాలో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.