ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 ఎడి’. ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ భారతీయ పురాణాలలో రూట్ అయిన ‘కల్కి 2898 ఎడి’ సినిమాటిక్ యూనివర్స్‌ని ప్రేక్షకులకు పరిచయం చేస్తే, తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఇంకా డీప్‌గా ఎపిక్ నెరేటివ్‌ని మహా అద్భుతంగా చూపింది. అమితాబ్ బచ్చన్ ‘అశ్వత్థామ’గా డేరింగ్ స్టంట్స్ చేస్తే, కమల్ హాసన్ ‘యాస్కిన్’గా గుర్తించలేని డెడ్లీ అవతార్‌లో కనిపించారు. ‘బుజ్జి’తో కలిసి ప్రభాస్ ‘భైరవ’గా బౌంటీ హంట్‌లో అదరగొట్టారు. దీపికా పదుకొనె ‘సుమతి’ పాత్రను పోషించింది. దిశా పటానీ ‘రాక్సీ’గా పవర్ ఫుల్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ ఈ సినిమాలోని మూడు డిఫరెంట్ వరల్డ్స్‌ని పరిచయం చేసింది. దర్శకుడు నాగ్ అశ్విన్ విజనరీ అప్రోచ్, అద్భుతమైన విజువల్స్, స్టొరీ టెల్లింగ్‌తో భారతీయ సినిమాని రిడిఫైన్ చేయగలదని, అది ఈనెల 27న నిరూపించగలదనే నమ్మకం ఉంది అని చిత్ర యూనిట్ తెలిపింది.