నవతెలంగాణ – పెద్దవంగర
కల్లు గీత కార్మిక సంఘం 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను మండల కేంద్రంలో ఆదివారం ఎస్సై పిల్లల రాజు చేతుల మీదుగా ఆ సంఘం మండల అధ్యక్షుడు అనపురం రవి గౌడ్, ప్రధాన కార్యదర్శి యాకయ్య లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ.. అనేక మంది కల్లు గీత కార్మికులు ఇటీవల కాలంలో వృత్తి రీత్యా, అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల్లో మరణించారని వారి కుటుంబాలకు ఎలాంటి షరతులు లేకుండా ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. అర్హులైన గీత కార్మికులందరికీ మోపెడ్లు, బైకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్పొరేషన్‌కు బడ్జెట్ కేటాయించాలన్నారు. చెట్ల పెంపకానికి భూమి, కల్లు మార్కెట్, నీర ఉత్పత్తులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులకు సభ్యత్వం, గుర్తింపు కార్డులు వెంటనే జారీ చేయాలన్నారు. కార్యక్రమంలో కార్యక్రమంలో పోలీసులు బాలాజీ, వీరన్న, కల్లు గీత కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షుడు తాండాల అయోధ్య, నాయకులు మొగులగాని హరీష్, మందపూరి సతీష్, దీకొండ వెంకన్న, కమలాకర్, సత్యనారాయణ, రమేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.