కల్లుగీత కార్మిక కార్పొరేషన్ ఏర్పాటు చేయలి

– కల్లుగీతా కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పచ్చిమట్ల  రవీందర్ గౌడ్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
దేశంలో అతి పురాతన వృత్తులలో కల్లు గీత కార్మిక వృత్తి ఒకటని రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కల్లుగీతా కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పచ్చిమట్ల రవీందర్ గౌడ్ అన్నారు. శనివారం హుస్నాబాద్ లో విలేఖరులతో మాట్లాడుతూ తాటి చెట్లు ఈత చెట్లు ఎక్కే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కల్లుగీత కార్మిక కార్పొరేషన్  సేఫ్టీ మొకులు అందించేందుకు రూ.1000 కోట్లు కేటాయించాలని అన్నారు. తాటి చెట్టు పైనుండి పడి చనిపోతే గీత కార్మికులకు గుది బండగ మారిన  మెడికల్ బోర్డు నిబంధనలు వెంటనే తొలగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  పచ్చిమట్ల అంజయ్య, తాళ్లపల్లి లక్ష్మణ్, ఎల్లయ్య, పెద్ద రవి పాల్గోన్నారు.