నవతెలంగాణ-సంగారెడ్డి
కల్లుగీత కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ రూపొందించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్‌ను సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఎక్సైజ్ కార్యాలయంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, హరికిషన్, సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి, బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి జగదీష్, ఎక్సైజ్ సీఐలు, మధుబాబు, అశోక్ కుమార్ సుబ్రహ్మణ్యం, సంగారెడ్డి జెడ్పీటీసీ సునీత మనోహర్ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ కష్ణ గౌడ్ కౌన్సిలర్ లావణ్య ప్రభు గౌడ్, మాజీ జెడ్పిటిసి మల్ల గౌడ్, కల్పగురు సర్పంచ్ పాండు గౌడ్ , డాక్టర్ స్వామి గౌడ్ జిల్లా అధ్యక్షులు ఆశన్న ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్న గౌడ్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్ మనీష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లుగీత వత్తిని ప్రతిబింబించేలా బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిని తెలియజేసే విధంగా కల్లుగీత కార్మిక సంఘం క్యాలెండర్ రూపొందించడం అభినందనీయమన్నారు. గీత కార్మికులు గౌడ సోదరులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి మంచి భవిష్యత్తు కల్పించాలని, వత్తి, రక్షణ కోసం ఉపాధి కోసం జరిగి కార్యక్రమాలలో, మా వంతు సహాయ సహకారాలు అందించి గీతా కార్మికుల గౌడ కులస్తుల సంక్షేమం కోసం కషి చేస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం సంఘం జిల్లా నాయకులు కష్ణ గౌడ్, రామా గౌడ్, నరసింహ గౌడ్ వెంకటేశం గౌడ్, అనంతరం గౌడ్, ప్రతాప్ గౌడ్ అనిల్ గౌడ్ అశోక్ గౌడ్ సత్యనారాయణ గౌడ్, యాద గౌడ్, నారాయణ గౌడ్ కష్ణ గౌడ్ హరీష్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, కష్ణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.