– బెల్టు షాపులను తక్షణమే తొలగించాలి : మంత్రి జూపల్లికి కల్లుగీత కార్మిక సంఘం వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఏజెన్సీ ఏరియాలో కల్లుగీత వృత్తి చేస్తున్న గీత కార్మికుల సొసైటీలను పునరుద్ధరించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలనీ, విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్టు షాపులను తక్షణమే తొలగించాలని కల్లుగీత కార్మిక సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఆదివారం హైదరాబాద్‌లో ఎక్సైజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావుకు 16 అంశాలతో కూడిన వినతి పత్రం అందజేశారు. మంత్రి స్పందిస్తూ త్వరలో సంఘం నాయకత్వంతో భేటీ అయిన తర్వాత సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు వి వెంకట నరసయ్య, హైదరాబాద్ అధ్యక్షులు ఎం కృష్ణస్వామిగౌడ్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బోయపల్లి సుధాకర్‌గౌడ్ ఉన్నారు.