గిద్ద పాఠశాలలో కాలోజి జయంతి వేడుకలు

Kaloji Jayanti celebrations at Gidda Schoolనవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని గిద్దా జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం కాలోజి నారాయణరావు జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాలోజీ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాణిక్యం రెడ్డి, ఉపాధ్యాయులు విష్ణువర్ధన్, స్వప్న ప్రియ, కైలాస్, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.