క్రీడసామాగ్రిని అందజేసిన ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షురాలు కల్పన

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
భువనగిరి మండలంలోని  అనాజిపురం గ్రామంలో ప్రభుత్వ క్రీడ సామాగ్రిని యువకులకు ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షురాలు గునుగుంట్ల కల్పనా శ్రీనివాస్ యువకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడా సామాగ్రి తో యువకులందరూ క్రీడలు ఆడుకుంటూ వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని,  క్రీడల తోటి గ్రామానికి, మండలానికి మంచి గుర్తింపు తేవాలని  కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ పాల సంఘం చైర్మన్ ఏదునూరి మల్లేశం,  పంచాయతీ సెక్రెటరీ బట్టు స్వాతి, మాజీ వార్డు మెంబర్లు మామిడాల శ్రీనివాస్, పిట్టల వెంకటేశం, నాయకులు వెలిశాల కృష్ణ,వెలిశాల మురళి, కడారి భరత్,  గోగు మల్లేశం, పిట్టల శ్రీశైలం,  కారోబార్ బొల్లెపల్లి స్వామి,  యువకులు పాల్గొన్నారు.