మండలంలోని కల్వకుంట్ల సీపీఐ(ఎం) గ్రామ కార్యదర్శిగా పగిళ్ల మధు, సహాయ కార్యదర్శిగా ముందు చిన్న నరసింహను ఆదివారం ఆ గ్రామంలో జరిగిన సీపీఐ(ఎం) 17వ గ్రామ మహాసభ లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి , జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కమ్యూనిస్టులకు కంచుకోటగా పేరు కాంచిన కల్వకుంట్ల గ్రామంలో పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తామని అన్నారు. తమ నియామకానికి సహకరించిన గ్రామ మండల జిల్లా స్థాయి నాయకులకు ఆరు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మిర్యాల భరత్ , సహాయక కార్యదర్శి వరుకుప్పల ముత్యాలు , గ్రామ శాఖ నాయకులు నారబోయిన నరసింహ ,పగిళ్ల మధు, బొందు చిన్న నరసింహ, బొందు అంజయ్య, అయితగోని యాదయ్య, పగిళ్ల యాదయ్య, కట్ట మారయ్య, పుల్కారం అంజయ్య, జిల్లపల్లి యాదయ్య, పగిళ్ల వెంకన్న, కట్ట ఆంజనేయులు, బొందు సుందరయ్య, చేకూరి బిక్షం, కుక్కల బాలస్వామి, సింగపంగా లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.