– టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత ఎద్దేవా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
లిక్కర్ కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళల అంశాన్ని ఎత్తుకున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత విమర్శించారు. మహిళల పేరుతో కల్వకుంట్ల కవిత శివరాత్రి నిరాహార దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆమె విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ మహిళా పక్షపాతి ప్రభుత్వమన్నారు. కవిత స్వలాభం కోసమే డ్రామాలాడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేత డీకే అరుణ రాజకీయ భవిష్యత్ కోసం పని చేస్తున్నారు తప్ప పాలమూరు కోసం కాదన్నారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఎందుకు తీసుకరాలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎస్‌కు ఏటీఎం అన్న బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.