
– జంగారెడ్డిపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం
నవతెలంగాణ-ఆమనగల్
కాంగ్రెస్ తోనే కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఐక్యత ఫౌండేషన్ చైర్మెన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డి పల్లి గ్రామంలో సోమవారం స్థానిక నాయకులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కల్వకుర్తి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను వేడుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, చేయూత, యువ వికాసం, రైతు భరోసా తదితర పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా స్థానిక నాయకులు, మహిళలు బతుకమ్మలు కోలాటాలతో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి విజయ తిలకం దిద్ది మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుర్రం కేశవులు, మాజీ ఎంపీపీ ధనుంజయ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వస్పుల మానయ్య, మైనార్టీ నాయకులు ఖాదర్ ఖాద్రీ, యూత్ కాంగ్రెస్ జిల్లా, తాలూకా అధ్యక్షులు రవికాంత్ గౌడ్, రాపోతు అనిల్ గౌడ్, జిల్లా కార్యదర్శి కృష్ణ నాయక్, ఖలీల్, గబ్బర్ యాదవ్, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.