– జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్
– కల్వకుర్తిలో బీఆర్‌ఎస్ జెండా ఎగురడం ఖాయం
– గ్యారెంటీ లేని డిక్లరేషన్‌లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
నవతెలంగాణ-ఆమనగల్
కల్వకుర్తి గడ్డ జైపాల్ యాదవ్ ఆడ్డ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ జెండా ఎగురడం ఖాయమని జిల్లా పరిషత్ గ్రామీణాభివద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కడ్తాల్ మండల జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. కడ్తాల్ మండల కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. 60 సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది ఏమిలేదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ బీఆర్‌ఎస్ అని ఆయన గుర్తు చేశారు. మాజీ శాసనసభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి నాలుగు సంవత్సరాల క్రితం కల్వకుర్తి నియోజకవర్గం, ప్రజలను పట్టించుకోకుండా ఉండి నేడు మళ్ళీ ఓట్ల పండుగను దష్టిలో పెట్టుకొని తిరిగి రావడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోనే కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వడం జగ మెరిగిన సత్యమని గుర్తు చేశారు. అదును చూసి తగిన సమయంలో వాత పెడ్తారని దశరథ్ నాయక్ హితవు పలికారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కల్వకుర్తి నియోజకవర్గంలో జైపాల్ యాదవ్ విజయం సాధించడం ఖాయమని దశరథ్ నాయక్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్, ఆమనగల్ కడ్తాల్ మండలాల పీఏసీఎస్ చైర్మెన్ గంప వెంకటేష్ గుప్తా, సర్పంచులు గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి, కష్ణయ్య యాదవ్, భారతమ్మ నర్సింహ గౌడ్, సులోచన సాయిలు, ఎంపీటీసీ సభ్యులు లచ్ఛిరామ్ నాయక్, మంజుల చంద్రమౌళి, డైరెక్టర్లు నరసింహ, వెంకటేష్, ఉపసర్పంచ్ వినోద్, జలీల్, నాయకులు సాబేర్, శ్రీను, రమేష్, సురేష్, నాగార్జున, బీక్యా నాయక్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.