చరిత్రకెక్కిన కల్వకుర్తి

Kalvakurti is steeped in history– 1989లో సీఎం ఎన్టీఆర్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు
– తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్‌ గల్లంతు
నవతెలంగాణ -కల్వకుర్తి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1989 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశంలోనే చరిత్ర సృష్టించాయి. నేషనల్‌ ఫ్రంట్‌ చైర్మెన్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనపై కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే చిత్తరంజన్‌ దాస్‌ పోటీ చేసి 3568 కోట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో అప్పట్లో కల్వకుర్తి నియోజకవర్గం పేరు దేశ స్థాయిలో మారుమొరోగింది. సాధారణ వ్యక్తి చేతిలో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఓడిపోవడంపై తీవ్ర చర్చ సాగింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీగా పుట్టపాగ రాధాకృష్ణ వ్యవహరించారు. స్థానిక పార్టీ నాయకులకు నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించకపోవడం వల్ల ముఖ్య నాయకులు రామారావు గెలుపు కోసం అంతగా ప్రయత్నించలేదన్న విమర్శలు అప్పట్లో ఉన్నాయి. ఎన్టీఆర్‌ ఓటమితోపాటు ఈ ప్రాంత అభివృద్ధికి నోచుకోలేదు. దాంతో 1989లో ఎన్టీ రామారావును ఓడించిన చిత్తరంజన్‌ దాస్‌ 1994 అసెంబ్లీ ఎన్నికలలో నాలుగో స్థానానికి పరిమితమై డిపాజిట్‌ సైతం దక్కించుకోలేదు.