– ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
నవతెలంగాణ-కోట్‌పల్లి
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరమని తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం తాండూర్ ఎమ్మెల్యే నివాసంలో కోట్‌పల్లి మండలానికి చెందిన 6 గురికి షాదీ ముబారక్, నలుగురికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్, సీనియర్ నాయకులు పతంగి పాండు, లింగారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, కోట్‌పల్లి ఎంపీటీసీ మహేష్‌గౌడ్, మండల ఉపాధ్యక్షులు అనంతరెడ్డి, దినేష్, సర్దార్ ఖాన్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.