కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆపొద్దు..

– లబ్ధిదారుల గ్రామాలకు వెళ్లి చెక్కులను పంపిణీ చేయండి..
– ఏ సమస్య ఉన్న నా దగ్గరికి రండి నేను పరిష్కరిస్తా..
– మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
నవతెలంగాణ- మునుగోడు
ఆడబిడ్డలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం నుండి మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను మంజూరైన వెంటనే లబ్ధిదారులకు అందించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని తమ  క్యాంపు కార్యాలయంలో  మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని విస్మరించి పాలించిన కేసీఆర్ కు  రాష్ట్ర ప్రజలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పడంతో  ఫామ్ హౌస్ పరిమితం చేయడంతో  నిజమైన తెలంగాణ ఇప్పుడు వచ్చిందని ప్రజల వద్దకే ప్రజాపాలన తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఆరు గ్యారెంటీలను పొందేందుకు దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ఏ పని ఉన్న ఇక్కడ నా క్యాంప్ ఆఫీస్ కి వస్తే పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. బెల్ట్ షాపులు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయమని దానికోసం ప్రజలంతా నాతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మునుగోడు మండల తహసిల్దార్ నరేందర్ డిప్యూటీ తాసిల్దార్ నరేష్ డిసిసిబి డైరెక్టర్ మునుగోడు పిఎసిఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, సర్పంచులు తాటికొండ సంతోష సైదులు, మిరియాల వెంకటేశ్వర్లు, బొజ్జ సుజాత శ్రీను, జాల వెంకన్న యాదవ్, పగిళ్ల బిక్షమయ్య, వల్లూరి పద్మ లింగయ్య, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పాల్వాయి చెన్నారెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు తదితరులు ఉన్నారు.