రెంజల్ మండలంలోని నిరుపేదలైన కుటుంబాలకు మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాల వారిగా ఈ చెక్కులను పంపిణీ చేశారు కల్యాణ లక్ష్మి కింద 20, షాది ముబారక్ 54 మందికి ఇట్టి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోధనా ఆర్డీవో రాజేశ్వర్, తాసిల్దార్ శ్రవణ్ కుమార్, రెంజల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొబిన్ ఖాన్, జి సాయ రెడ్డి, నరసయ్య, సురేష్ పాటిల్, కుదూస్, తదితరులు పాల్గొన్నారు.